Skip to main content

బడ్జెట్ మరియు షెడ్యూల్‌ను సెట్ చేసేందుకు Meta యాడ్‌ల మేనేజర్‌ని ఉపయోగించడం ఎలా

  • By Meta Blueprint
  • Published: Jul 14, 2022
  • Duration 5m
  • Difficulty Intermediate
  • Rating
    Average rating: 0 No reviews

మొత్తం వ్యయాన్ని నియంత్రించడంలో సహాయపడేందుకు యాడ్ సెట్‌లో మీరు ఖర్చు చేయాలనుకుంటున్న డబ్బు మరియు మీరు ఏర్పరచాలనుకుంటున్న బడ్జెట్ రకం సెట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఈ పాఠం మిమ్మల్ని వీటికి సిద్ధం చేస్తుంది:

  • Meta యాడ్‌ల మేనేజర్‌లో ఒక యాడ్ క్యాంపెయిన్ బడ్జెట్‌ను నిర్ధారించి, వ్యయ పరిమితిని సెట్ చేయడం. 
  • మీ క్యాంపెయిన్‌ల కోసం షెడ్యూల్‌ను సెట్ చేయడం. 

మీ యాడ్‌ల కోసం బడ్జెట్‌ను సెట్ చేయండి

మీరు ఒక యాడ్ క్యాంపెయిన్‌ను సృష్టించినప్పుడు, మీరు డబ్బు చాలా తెలివిగా ఖర్చు చేస్తున్నామని నిర్ధారించుకోండి. క్యాంపెయిన్ కోసం బడ్జెట్‌ను సెట్ చేయడం వలన వ్యాపార లక్ష్యాలను రీచ్ కావడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది. 


ప్రకటన బడ్జెట్ మిమ్మల్ని అధిక వ్యయం చేయకుండా నిరోధించడంతో పాటు వనరులను సమర్ధవంతంగా కేటాయించేలా చేస్తుంది. బడ్జెట్‌ను సెట్ చేయడానికి మరియు యాడ్ సెట్ స్థాయిపై దృష్టి పెట్టడానికి యాడ్‌ల మేనేజర్‌ని ఉపయోగించడం ఎలాగో ఈ పాఠం సమీక్షిస్తుంది. 

బడ్జెట్ వ్యూహాన్ని నిర్ధారించండి

యాడ్‌ల మేనేజర్‌లో, వ్యాపార లక్ష్యాన్ని సాధించడం కోసం మీ ఆడియన్స్‌లోని వ్యక్తులను రీచ్ కావడానికి మీరు ఒక యాడ్ కోసం వెచ్చించే డబ్బును బడ్జెట్ అంటారు. మీరు బడ్జెట్‌ను క్యాంపెయిన్ స్థాయి లేదా యాడ్ సెట్ స్థాయిలో సెట్ చేయగలరు. 


బడ్జెట్‌లు రెండు రకాలుగా ఉంటాయి:



ఈ బడ్జెట్ రకం అత్యుత్తమ సంఖ్యలో ఫలితాల కోసం ఖర్చును అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి గొప్ప అవకాశాన్ని అందించే యాడ్ సెట్‌లకు నిజ సమయంలో ఆటోమేటిక్‌గా పంపిణీ చేసేలా క్యాంపెయిన్ స్థాయిలో ఒక బడ్జెట్‌ని సెట్ చేయండి.

మీకు ఎలా ఛార్జీ చేయబడుతుంది

మీరు యాడ్‌ల కోసం మూడు సాధ్యమైన మార్గాలలో ఛార్జీ చేయబడతారు. మీరు ఎంచుకున్న యాడ్ ఆబ్జెక్టివ్‌పై ఆధారపడి, ఇంప్రెషన్‌లు, క్లిక్‌లు లేదా చర్యల ఆధారంగా మీకు ఛార్జీ విధించబడుతుంది. ఈ ఎంపికల గురించి మరియు అవి వ్యాపారానికి ఎలా వర్తించవచ్చనే దాని గురించి మరింత తెలుసుకుందాం:


క్యాంపెయిన్‌లో మీరు స్వీకరించే ప్రతి 1,000 ఇంప్రెషన్‌లకు ఛార్జీని పొందండి, దీనిని మిల్లీకి ధర (CPM) లేదా 1,000 ఇంప్రెషన్‌లకు ధర అని కూడా పిలుస్తారు. అడ్వర్టయిజింగ్ క్యాంపెయిన్ కోసం ఖర్చు చేసిన పూర్తి మొత్తాన్ని ఇంప్రెషన్‌ల సంఖ్యతో భాగించి 1,000తో గుణించడం ద్వారా CPM కొలవబడుతుంది. మీ లక్ష్య ప్రేక్షకులకు స్క్రీన్‌పై యాడ్ చూపబడిన ప్రతి 1,000 సార్లు మీకు ఛార్జీ విధించబడుతుందని దీని అర్థం. చాలా యాడ్ ఆబ్జెక్టివ్‌లకు మీకు CPM ఆధారంగా ఛార్జీ చేయబడుతుంది.


లిటిల్ లెమన్

మనం ముందుగానే తెలుసుకున్నట్లుగా, లిటిల్ లెమన్ అనేది సాంప్రదాయ మధ్యధరా ప్రాంతపు వంటకాలను ఆధునిక పద్ధతులలో అందించే స్థానిక రెస్టారెంట్ చెయిన్. ఇక్కడి మెను ఇటాలియన్, గ్రీక్ మరియు టర్కిష్ సంస్కృతుల నుండి ప్రేరణ పొందిన వంటకాలను కలిగి ఉండడంతో పాటు సీజన్‌వారీగా 12-15 ఐటమ్‌ల మధ్య మారుతూ ఉంటుంది. కస్టమర్‌లు రోజులోని ఏ సమయంలోనైనా సరసమైన ధరతో కూడిన తమ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించగలిగేలా, రిలాక్స్డ్ వాతావరణాన్ని అందజేస్తున్నందుకు రెస్టారెంట్‌లు గర్వపడతాయి. తహ్రిషా లిటిల్ లెమన్‌లో మార్కెటింగ్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఆవిడ ఇప్పుడే బృందంలో చేరడంతో పాటు లిటిల్ లెమన్ కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ డెలివరీ సర్వీస్‌ను సామాజిక మాధ్యమంలో మార్కెటింగ్ చేయడంపై దృష్టి పెట్టారు.*

కొత్త డెలివరీ సర్వీస్‌ను ప్రచారం చేయడానికి తహ్రిషా యాడ్‌లను ప్రదర్శించడం ప్రారంభించింది. ఆవిడ అవగాహనను తన క్యాంపెయిన్ లక్ష్యంగా సెట్ చేసింది. ఈ లక్ష్యం కోసం అందుబాటులో ఉన్న ఛార్జీ ఎంపిక CPM ప్రాతిపదికన చెల్లించాలని ఆమె చూస్తుంది. తన తదుపరి నెలవారీ బిల్ తేదీ నాటికి, తాను అందుకున్న ప్రతి వెయ్యి ఇంప్రెషన్‌లకుగానూ తహ్రిషా ఛార్జ్ చేయబడుతుంది. 


ప్రత్యామ్నాయంగా, తహ్రిషా తన వీడియో వీక్షణలను అనుకూలపరచడంలో సహాయపడటానికి ఎంగేజ్‌మెంట్‌ను క్యాంపెయిన్ లక్ష్యంగా సెట్ చేస్తే, ఇంప్రెషన్‌లు లేదా చర్యకు ధరతో ఛార్జీ విధించే అవకాశం ఆమెకు ఉంటుంది, ఈ సందర్భంగా ఆమె వీడియో పూర్తి అయ్యే వరకు ప్లే చేయబడిన ఒక్కో పర్యాయాన్ని సూచిస్తుంది. తహ్రిషా చర్యకు ధర ప్రాతిపదికన ఛార్జీని పొందాలని ఎంచుకుంటుంది, కాబట్టి ఆమె అందుకున్న పూర్తి వీడియో వీక్షణలకు మాత్రమే ఆమె చెల్లిస్తుంది. 


*నిరాకరణ ప్రకటన: లిటిల్ లెమన్ అనేది Meta క్రియేటివ్ షాప్ ద్వారా రూపొందించబడిన సృజనాత్మక వ్యాపారం. నిజ జీవిత వ్యాపారాల ద్వారా అందించబడిన కంటెంట్‌కు ఏవైనా సారూప్యతలు ఉన్నట్లయితే, అవి ఉద్దేశ్యపూర్వకమైనవి కావు.  

మీ బడ్జెట్‌ను సర్దుబాటు చేయండి

యాడ్ సెట్‌లో నుండి ఎంపిక చేసుకునేందుకు రెండు రకాల యాడ్ బడ్జెట్‌లు ఉన్నాయి: రోజువారీ మరియు జీవితకాల బడ్జెట్‌లు. ఒక యాడ్ సెట్‌లోని బడ్జెట్ & షెడ్యూల్ క్రింద బడ్జెట్‌కు పక్కన ఉన్న డ్రాప్‌డౌన్ మెను నుండి మీరు ఒక్కో రకం యాడ్ బడ్జెట్‌ను ఎంచుకోగలరు. ఒక్కో దాని మధ్య తేడాలను సమీక్షిద్దాం.


ఒక్కొక్క యాడ్ సెట్ లేదా క్యాంపెయిన్‌పై మీరు రోజువారీగా ఖర్చు పెట్టాలని కోరుకుంటున్న సరాసరి మొత్తం. చాలా రోజులలో, మీరు అనుకూలపరిచిన ఫలితానికి సంబంధించి దాదాపు మీ రోజువారీ బడ్జెట్ విలువను మీరు పొందుతారు. అయితే, అత్యుత్తమమైన అవకాశాలను పొందగలిగే నిర్దిష్ట రోజులు కూడా ఉండవచ్చు. ఆ రోజులలో, Meta సాంకేతికతలు మీ రోజువారీ బడ్జెట్ కంటే గరిష్టంగా 25% కంటే ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. ఉదాహరణకు, మీ రోజువారీ బడ్జెట్ $10 అయినట్లయితే, ఏదైనా నిర్దిష్ట రోజున Meta సాంకేతికతలు గరిష్టంగా $12.50 ఖర్చు చేయవచ్చు.


జీవిత కాలం లేదా రోజువారీ బడ్జెట్‌లను ఎంచుకుంటున్నప్పుడు పరిగణించవలసిన విషయాలు

ఫలితాలను పెంచడంతో పాటు మొత్తం ఖర్చులను వీలైనంత తక్కువగా ఉంచడానికి జీవితకాల బడ్జెట్ మిమ్మల్ని అనుమతిస్తుంది. క్యాంపెయిన్‍ యొక్క జీవిత కాలంలో అందుబాటులో ఉన్న అవకాశాల సంఖ్యను రోజువారీ బడ్జెట్ పరిమితం చేస్తుంది.


లిటిల్ లెమన్ కోసం, ఫలితాలను పెంచుకోవడానికి మరియు తన యాడ్‌ను చూపించడానికి అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన అవకాశాలను పొందడానికి తహ్రిషా ఒక నెల రోజుల బ్రాండ్ అవగాహన క్యాంపెయిన్ కోసం జీవితకాల బడ్జెట్‌ను ఎంచుకుంది.  


ఖాతా వ్యయ పరిమితిని నిర్ధారించండి

ఖాతా వ్యయ పరిమితి అనేది క్యాంపెయిన్‌ల జీవితకాలంలోని అన్ని క్యాంపెయిన్‌లకు వర్తిస్తుంది. వెచ్చించిన మొత్తం ప్రస్తుత పరిమితిని రీచ్ అయినప్పుడు, మీ యాడ్‌లు పాజ్ అవుతాయి తద్వారా మీరు డబ్బు ఖర్చు చేయరు. మీ ఖాతా వ్యయ పరిమితి ఆటోమేటిక్‌గా రీసెట్ చేయబడదు. మీరు మీ పరిమితిని చేరుకున్న తర్వాత అడ్వర్టయిజ్ చేయడం కొనసాగించేందుకు, మీరు మీ పరిమితిని అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.

మరింత తెలుసుకోవడానికి హెడర్‌లను విస్తరించండి. 

మీ యాడ్ కోసం షెడ్యూల్‌ను సెట్ చేయండి

మీరు యాడ్ సెట్ కోసం బడ్జెట్‌ను సెట్ చేసిన తర్వాత, యాడ్‌లు ఎప్పుడు ప్రదర్శింపబడాలి అని నిర్ధారించేందుకు మీరు షెడ్యూల్‌ను సెట్ చేయగలరు. 

​విభిన్నమైన ప్రారంభ మరియు ముగింపు తేదీలను ఎంచుకోండి​

వారంలో మీరు మీ యాడ్ సెట్‌ను ప్రదర్శించాలనుకుంటున్న నిర్దిష్ట సమయాలను ఎంచుకోవడానికి చార్ట్‌ని ఉపయోగించండి. ఈ ఎంపిక యాడ్ సెట్ స్థాయి బడ్జెట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, మీరు అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు అందుబాటులో ఉండదని గుర్తుంచుకోండి. మీ యాడ్ ఎప్పుడు ప్రదర్శింపబడాలి అని ఎంచుకునేందుకు ప్రారంభ మరియు ముగింపు తేదీని సెట్ చేయడం ఎంచుకోండి. మీరు యాడ్‌ను ప్రదర్శించడం ప్రారంభించి, పూర్తి చేయాలనుకుంటున్న నిర్దిష్ట సమయాలను కూడా ఎంచుకోవచ్చు. మీరు పూర్తి చేసిన తర్వాత, యాడ్ సెట్ ఎన్ని రోజులు ప్రదర్శింపబడుతుంది మరియు మీరు ఎంచుకున్న బడ్జెట్ మరియు తేదీల ఆధారంగా ఖర్చు చేయబడే గరిష్ట బడ్జెట్ మొత్తాన్ని మీరు చూడగలరు. 


ఉదాహరణకు, తహ్రిషా లిటిల్ లెమన్ యాడ్‌ను సోమవారం ప్రారంభమై, ఆదివారం ముగిసేలా సెట్ చేసారు. వ్యక్తులు తమ రాత్రి భోజనాన్ని డెలివరీ చేయమని ఆర్డర్ చేయడాన్ని ప్రాంప్ట్ చేసేలా ఆవిడ తన యాడ్‌లను మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శింపబడేలా సెట్ చేస్తుంది.


మీరు జీవితకాల బడ్జెట్‌ను ఎంచుకున్నప్పుడు, మీరు యాడ్ సెట్ షెడ్యూల్‌ను మరింత మెరుగుపరచవచ్చు. ఈ షెడ్యూల్ చేసే ఎంపికను వీక్షించేందుకు, మీరు అధునాతన ఎంపికలను చూపించు ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది. అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను సమీక్షిద్దాం.

అధునాతన షెడ్యూలింగ్ ఎంపికలు

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మీ యాడ్ వ్యయాన్ని అనుకూలపరిచేందుకు, రోజువారీ బడ్జెట్ (ప్రతిరోజు యాడ్ సెట్ లేదా క్యాంపెయిన్ కోసం మీరు ఖర్చు చేయడానికి ఇష్టపడే సగటు మొత్తం) లేదా జీవితకాల బడ్జెట్ (యాడ్ సెట్ లేదా క్యాంపెయిన్ యొక్క పూర్తి ప్రదర్శన కాలంలో మీరు ఖర్చు చేయడానికి ఇష్టపడే మొత్తం) సెట్ చేయండి.




మీ వ్యాపార క్యాలెండర్‌తో సమలేఖనమయ్యే మీ యాడ్ సెట్ కోసం షెడ్యూల్‌ను సృష్టించండి. 




మీ బడ్జెట్ ట్రాక్‌లోనే ఉన్నట్లుగా నిర్ధారించుకోవడంలో సహాయపడేందుకు, యాడ్‌ల మేనేజర్‌లో ఖాతా వ్యయ పరిమితిని నిర్ధారించండి.